'బయటి ఊళ్లో బానిసలా బతికినా తప్పులేదు భయ్యా.. కానీ సొంతూరిలో మాత్రం సింహంలా ఉండాలి'.. ఈ ఒక‍్క డైలాగ్ తో 'రంగబలి' స్టోరీ ఏంటనేది దాదాపుగా చెప్పేశారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా.. జూలై 7న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ ని విడుదల చేసింది. హీరో- సొంతూరు అంటే ఇష్టం అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి పూర్తి ఫన్నీగా తీర్చిదిద‍్దినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది.
(ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)
ట్రైలర్ లో ఏముంది?
సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడు.. పండగ, పబ్బం ఏదైనా సరే ఇక్కడి ఉండి చేసుకునే రకం. ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉన్న హీరో లైఫ్ లోకి కొన్ని సమస్యలు రావడం వరకు ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది బిగ్ స్క్రీన్ పై చూడాలి. ఈ ట్రైలర్ లోనే హీరోయిన్ తో ఓ లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు చూపించారు. అంతా చూస్తుంటే చాలావరకు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ సినిమాలో కామెడీతో ఏమైనా మాయ చేస్తారేమో చూడాలి?
బూతు డైలాగ్ మర్చిపోయారా?
'రంగబలి' ట్రైలర్ అంతా బాగానే ఉంది కానీ 'దింపి..' అనే ఓ బూతు డైలాగ్ ని అలానే ఉంచేశారు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరినీ ఇది అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల‍్లో ఇలాంటి డైలాగ్స్ అంటే పర్లేదు కానీ బిగ్ స్క్రీన్ పై చూసే సినిమాల్లో ఇలాంటి డైలాగ్ చెప్పడం కాస్త వింతగా అనిపించింది. సెన్సార్ కి వెళ‍్తే.. దీన‍్ని కచ్చితంగా బీప్ చేసే అవకాశముంది. ఇందులో నాగశౌర్యకి హీరోయిన్ గా యుక్తి తరేజా నటించింది. సత్య కామెడీతో నవ్వులు పూయించాడు. 'దసరా' ఫేమ్ షైన్ టామ్ చాకో విలన్ గా సందడి చేయబోతున్నాడు.
(ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment