ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో నాగశౌర్య, తదుపరి చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఓ ఓల్డ్ క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.
గత జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ సినిమా ‘మూగ మనసులు’ టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే చాలా మంది హీరోలు ఇలాంటి క్లాసిక్ టైటిల్స్‌ను తీసుకొని చేతులు కాల్చుకున్నారు. మరి నాగశౌర్య ఆ టైటిల్‌కు ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది మేలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment