‘‘రంగబలి’ మంచి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా చూస్తున్నంత సేపు సొంత ఊరు గుర్తొస్తుంది. ఆ ఊరిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ కలిగి ఓసారి ఊరెళ్లి వద్దామనే ఆలోచన కలుగుతుంది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.
► నటుడికి దర్శకుడు స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్‌ని పవన్ నాకు ఇచ్చాడు. దర్శకునిగా తనకు తొలి సినిమా కాబట్టి ఏ విషయంలోనూ ఒత్తిడి తీసుకోవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పాను. నా అనుభవాన్ని, పవన్ విజన్‌ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా ‘రంగబలి’ లాంటి ఓ మంచి సినిమా తీశాం.
► ‘రంగబలి’ ప్రివ్యూ చూశాకే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తానని దర్శక–నిర్మాతలకు చెప్పాను. చూసిన తర్వాత చాలా మంచి మూవీ చేశామనే అనుభూతి కలిగింది. అందుకే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రేక్షకులకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. సుధాకర్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ‘రంగబలి’ తీశారు. ఈ మూవీతో పవన్‌కి మంచి పేరొస్తుంది. యుక్తి తరేజ మంచి యాక్టర్ అండ్ డ్యాన్సర్. తెలుగులో లీడింగ్ హీరోయిన్ అయ్యే అవకాశాలు తనకు చాలా ఉన్నాయి. పవన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
► ఇప్పుడున్న పోటీలో హీరోలందరూ అద్భుతమైన నటన, డ్యాన్స్, యాక్షన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నేనూ ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలో ఒక్కోసారి గాయాలవుతాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది.
► ఏప్రొడక్షన్ హౌస్‌లోనైనా పది హిట్స్ పడిన తర్వాత కూడా ఒక సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు. సినిమా అంటే మాకు పిచ్చి.. ఫ్యాషన్‌తోనే మా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నాం తప్ప డబ్బులు సంపాదించుకోవాలని కాదు. మాకు సినిమా తప్పితే వేరేది తెలియదు. ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. నేను నటిస్తున్న 24వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
అతనికి ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పా: నాగశౌర్య
Published Thu, Jul 6 2023 4:22 AM | Last Updated on Thu, Jul 6 2023 7:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment