Naga Shaurya And Ritu Varma's Varudu Kaavalenu Teaser Out Now - Sakshi
Sakshi News home page

Varudu Kaavalenu : ‘వరుడు కావలెను’ టీజర్‌ వచ్చేసింది

Published Tue, Aug 31 2021 10:39 AM | Last Updated on Tue, Aug 31 2021 11:57 AM

Varudu Kaavalenu Teaser Out - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.
(చదవండి: కార్తికేయ-2 : హీరోయిన్‌ను రివీల్‌ చేశారు.. )

తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం గొడవపడే ఓ యువతి, యువకుడి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేదే ఈ మూవీ నేపథ్యం అని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ‘అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్‌ అవ్వట్లేదే’, ఆ అందం.. పొగరు.. ఆర్డర్‌ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. ‘ఎవ్రీ బాల్‌ సిక్స్‌ కొట్టే బ్యాట్‌మెన్‌ చూశావా.. మా వాడు కొడతాడు.. ప్రతి బాల్‌ నోబాల్‌ అని ఇచ్చే  అంపైర్‌ని చూశావా.. ఆవిడ ఇస్తది’ లాంటి డైలాగ్స్‌ యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి.  యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement