ఇకపై ప్రతి శుక్రవారం ‘ల‌క్ష్య’ అప్‌డేట్స్‌ | Naga Shauryas Lakshya To Come Up With Update On Every Friday | Sakshi
Sakshi News home page

Lakshya Movie : శుక్రవారానికో అప్‌డేట్‌..రెడీగా ఉండండి

Published Fri, Jul 23 2021 6:28 PM | Last Updated on Fri, Jul 23 2021 6:28 PM

Naga Shauryas Lakshya To Come Up With Update On Every Friday - Sakshi

Lakshya Movie : సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో నాగశౌర్య ‘ల‌క్ష్య’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ‌శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ‌శౌర్య డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. నారాయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ‘లక్ష్య’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇకపై సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకు ప్రతి శుక్రవారం అనౌన్స్‌ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

#LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్‌తో ఇకపై ప్రతి వారం కొత్త అప్‌డేట్స్‌ రానున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్‌ వెల్లడించారు.ప్రేక్ష‌కుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కించినట్టు నిర్మాతలు తెలిపారు. నిజానికి ఏప్రిల్ నెలాఖరులోనే ‘లక్ష్య’ విడదుల కావాల్సి ఉండగా కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. ఇక ఈ చిత్రంలో  జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement