![Tollywood Young Hero Naga Shaurya Illness In Shooting at Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/14/naga.gif.webp?itok=yDFGWg_K)
యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. అత్యవసర చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అదే కారణమా?: ఆరు నెలలుగా సిక్స్ ప్యాక్ కోసం డైట్‌లో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇవాళ షూటింగ్‌లో కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆసుపత్రి నుంచి నాగ శౌర్య డిశ్చార్జ్ అవుతారని సమాచారం.
ఇటీవల విడుదలైన కృష్ణ వ్రింద విహారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నారు. అరుణాచలం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నాగశౌర్య కెరీర్‌లో ఇది 24వ చిత్రంగా నిలవనుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ఇంరా టైటిల్ ఖరారు చేయలేదు.
త్వరలోనే పెళ్లి: ఇటీవలే నాగశౌర్య త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్‌లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment