శ్రీసింహా, నేహా సోలంకి జంటగా తెరకెక్కిన చిత్రం భాగ్‌సాలే. ప్రణీత్ సాయి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కాలభైరవ సంగీతం అందించిన ఈ చిత్రంలోని కూత ర్యాంప్.. పాటని విడుదల చేశారు. కేకే సాహిత్యం అందించిన ఈ పాటను కాలభైరవ పాడారు.
నేటితరం యువతని ఆకట్టుకునే కథతో భాగ్‌సాలే రూపొందింది. కూత ర్యాంప్.. పాట యువతకి కనెక్ట్ అవువుతంది అని చిత్రయూనిట్ పేర్కొంది. జాన్ విజయ్, నందినీ రాయ్, రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రమేష్ కుషేందర్.
Comments
Please login to add a commentAdd a comment