
‘‘సర్వైవల్ థ్రిల్లర్స్ హాలీవుడ్, బాలీవుడ్‌లో వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఈ తరహా జానర్ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుంటుందనే ఫీలింగ్‌తో ‘దొంగ లున్నారు జాగ్రత్త’ సినిమా చేశాం. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ సింహా. సతీష్ త్రిపుర దర్శకుడిగా పరిచయం అవుతూ శ్రీ సింహా కోడూరి, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. డి. సురేష్‌బాబు, సునీత తాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో శ్రీ సింహా చెప్పిన విశేషాలు.
►కథ చాలా గ్రిప్పింగ్‌గా అనిపించడంతో విన్న వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. సినిమా నిడివి కూడా రెండు గంటలలోపే ఉంటుంది. ఓ దొంగ తన తప్పులను తాను ఎలా తెలుసుకున్నాడు? అనే అంశాలను దర్శకుడు ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు. రెగ్యులర్ లొకేషన్స్‌లో అయితే వీలైన విధంగా కెమెరాలు పెట్టొచ్చు. కానీ సినిమా ఎక్కువ భాగం కారులోనే ఉంటుంది. ఇందుకు తగ్గట్లుగా షూటింగ్ చేసేందుకు కొన్ని వర్క్ షాప్స్ చేశాం.
► కెమెరామేన్ యశ్వంత్ అద్భుతంగా షూట్ చేశారు. సతీష్ బ్రిలియంట్ డైరెక్టర్. చెప్పింది చెప్పినట్లు తీశారు. సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి బ్యాగ్రౌండ్ స్కోర్‌కు మంచి స్కోప్ ఉంది. మా అన్నయ్య కాలభైరవ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
► రాజమౌళిగారితో సినిమా చేయాలన్నది నా డ్రీమ్. ప్రస్తుతం నా స్థాయి ఏంటో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేయాలని ఇప్పుడే ఆశించడం లేదు. నా తర్వాతి చిత్రం ‘భాగ్ సాలే’ పూర్తయింది. ‘ఉస్తాద్’ షూటింగ్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment