మాగంటి మురళీ మోహన్‌ కుటుంబంతో కీరవాణి వియ్యం | MM Keeravani's Son Will Marriage To Murali Mohan's Granddaughter - Sakshi
Sakshi News home page

పెళ్లితో ఒకటి కానున్న కీరవాణి, మురళీ మోహన్‌ కుటుంబాలు

Published Mon, Oct 23 2023 2:18 PM

MM Keeravani Son Married To Murali Mohan Granddaughter - Sakshi

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈమేరకు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆస్కార్‌ అవార్డ్‌తో తెలుగు పరిశ్రమను ప్రపంచానికి తెలిపిన ఎమ్‌.ఎమ్‌ కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. నిర్మాత, సినీ నటుడు,వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్‌ మనుమరాలితో శ్రీసింహ ఏడు అడుగులు వేయనున్నాడని సమాచారం.

శ్రీసింహ ఇప్పటికే భాగ్ సాలే, మత్తు వదలరా, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా తన బాబాయ్‌ రాజమోళితో పాటు పలు సినిమాలకు కూడా పనిచేశాడు. మురళీ మోహన్‌కు ఒక అమ్మాయితో పాటు రామ్‌ మోహన్‌ అనే  అబ్బాయి ఉన్నారు. ఆయన కుమార్తెనే శ్రీసింహకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు.

రామ్‌ మోహన్‌- రూప మాగంటిలకు జన్మించిన ఏకైక కుమార్తె పేరు 'రాగ' కొద్దిరోజుల క్రితమే ఆమె ఐఎస్‌బీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే పలు కీలక బాధ్యతల్లో వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనకు ఇరుకుటుంబాలు వచ్చాయని తెలుస్తోంది. కానీ ఈ వివాహం గురించి రెండు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ విషయం ప్రచారంలో మాత్రమే ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement