Maganti Roopa
-
కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్ గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో.. నటుడు మురళీ మోహన్ మనుమరాలి పెళ్లి జరగనున్నట్లు రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత అవన్నీ నిజమేనని మురళీ మోహన్ కూడా ప్రకటించారు. తాజాగా ఆ పెళ్లి వేడుక విషయంపై మురళీ మోహన్ కోడలు మాగంటి రూప కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో తన కూతురు 'రాగ' పెళ్లి ఫిక్స్ అయినట్లు ఆమె పేర్కొన్నారు. మురళీ మోహన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఆయనతో పాటుగా కోడలు రూప కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగుతుందని ఆమె ప్రకటించారు. మురళీ మోహన్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కూతురు విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్ మోహన్ మాత్రం ఆయనకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్ మోహన్- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటుంన్నారట. ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ సినిమాలతో టాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడంతో బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని భావిస్తున్నారు. -
మాగంటి మురళీ మోహన్ కుటుంబంతో కీరవాణి వియ్యం
టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్‌తో తెలుగు పరిశ్రమను ప్రపంచానికి తెలిపిన ఎమ్.ఎమ్ కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. నిర్మాత, సినీ నటుడు,వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్ మనుమరాలితో శ్రీసింహ ఏడు అడుగులు వేయనున్నాడని సమాచారం. శ్రీసింహ ఇప్పటికే భాగ్ సాలే, మత్తు వదలరా, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా తన బాబాయ్ రాజమోళితో పాటు పలు సినిమాలకు కూడా పనిచేశాడు. మురళీ మోహన్‌కు ఒక అమ్మాయితో పాటు రామ్ మోహన్ అనే అబ్బాయి ఉన్నారు. ఆయన కుమార్తెనే శ్రీసింహకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు. రామ్ మోహన్- రూప మాగంటిలకు జన్మించిన ఏకైక కుమార్తె పేరు 'రాగ' కొద్దిరోజుల క్రితమే ఆమె ఐఎస్బీలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి సంబంధించి పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఉంది. 'రాగ' కూడా అందులోనే పలు కీలక బాధ్యతల్లో వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి కూడా మురళీ మోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచాయాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనుమరాలు 'రాగ'ను ఇచ్చి వివాహం చేయాలనే ఆలోచనకు ఇరుకుటుంబాలు వచ్చాయని తెలుస్తోంది. కానీ ఈ వివాహం గురించి రెండు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ విషయం ప్రచారంలో మాత్రమే ఉంది. -
ఏరీ... ఎక్కడ!
ప్రజా ప్రతినిధి అంటే ఓడినా, గెలిచినా నిత్యం ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఓటర్ల మన్ననలు అందుకోవాలి. ఓడితే ఆ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాసటగా నిలవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప, గంటి హరీష్‌ల జాడే కానరాకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): అధికారం ఉంటే హల్చల్ చేస్తారు. ఆ అధికారం దూరమైతే ఆచూకీలేకుండా పోతారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు హడావుడి... తెలుగుదేశం పార్టీ నేతల తీరు ఇదీ అని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల నుంచి పోటీచేసి ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ అభ్యర్థుల ఆచూకీ కోసం ఆయా నియోజకవర్గ ప్రజలు భూతద్దాలు పెట్టి వెతికినా కనిపించడంలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయింది. ఇన్ని నెలలయినా టీడీపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు పార్లమెంటు అభ్యర్థుల జాడ పార్టీ కార్యక్రమాల్లో లేకుండా పోయింది. మురళీ రాగం ఏమైంది...? మూడు నెలల కిందట ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాల నుంచి టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థులు మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, గంటి హరీష్ మాధుర్ ఎన్నికలైపోయాక నియోజకవర్గాన్నే మరచిపోయారు. సినీ నటుడు మాగంటి మురళీమోహన్ రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ కావాలని కలలుగని తొలిసారి 2009లో పోటీచేసి మహానేత వైఎస్ గాలిలో ఓటమి చవిచూశారు. అప్పుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై పోటీచేసి ఓడిపోయిన మురళీమోహన్ ఆ తరువాత సేవా కార్యక్రమాలతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతూండే వారు. తరువాత 2014లో పోటీచేసి ఎంపీ కావాలనే కలను మురళీమోహన్ సాకారం చేసుకున్నారు. ఎంపీ అయ్యాక కోడలు రూపను వెంట తిప్పుకుంటూ తన రాజకీయ వారసురాలుగా ఎంపీకి పోటీ చేస్తారనే సంకేతాల్లో పంపించారు. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా కోడలు రూప బరిలోకి దిగగా వైఎస్సార్సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ చేతిలో లక్షపై చిలుకు ఓట్ల తేడాతో ఘెర పరాజయాన్ని మూటగట్టుకోక తప్పింది కాదు. అప్పటి నుంచి మామ, కోడలు జనానికి దూరమయ్యారు. స్థానికత్వం కోసం రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్‌లో మురళీమోహన్ సొంత ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఈ నెలాఖరుకు రాజమహేంద్రవరంలోని ఇంటిని కూడా ఖాళీచేసి రాజకీయాలకు ప్యాకప్ చెప్పేందుకు సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంటి వద్ద పనిచేస్తున్న సిబ్బందికి నెలాఖరు వరకూ మాత్రమే పని ఉంటుందని, ఆ తరువాత ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పేశారంటున్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని మురళీమోహన్ చెప్పిన మాటలు ఏమయ్యాయని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. గంటి హరీష్దీ అదే దుస్థితి అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమిచెందిన గంటి హరీష్ మాధుర్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగికి ఉన్న పేరు, ప్రతిష్టలు, బాలయోగి వారసుడిగా సానుభూతి కలిసి వస్తుందని అతని కుమారుడు మాధుర్‌ను టీడీపీ బరిలోకి దింపింది. బాలయోగిపై ఉన్న సానుభూతితో గెలుపు ఖాయమనే అతి విశ్వాసానికి పోయిన ఆ పార్టీ ఫలితాల్లో బోర్లాపండింది. ఓటమి తరువాత మాధుర్ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అమలాపురం నల్లవంతెనకు సమీపాన ఇల్లును అద్దెకు తీసుకుని స్థానికంగా ఉంటామని ఎన్నికలప్పుడు నమ్మకాన్నికలిగించే ప్రయత్నం చేశారు. తీరా ఓడిపోయాక గడచిన మూడు నెలల్లో పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు లేవు. బాలయోగి వారసుడిగా పార్టీకి ఓ ఊపు వస్తుందనుకున్న అధిష్టానం అంచనాలు తలకిందులయ్యాయి. సునీల్ సీను అంతే... జిల్లా కేంద్రం కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి మూడోసారి ఓటమి తరువాత చలమలశెట్టి సునీల్ ఎక్కడున్నాడో పార్టీ శ్రేణులకు కూడా తెలియడం లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014 వైఎస్సార్సీపీ, 2019లో టీడీపీ...ఇలా మూడు ఎన్నికలు ... మూడు పార్టీలన్నట్టుగా పోటీచేసిన సునీల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినా మూడు ఎన్నికల్లో వరుస ఓటముల తరువాత పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే సాహసం చేయలేకపోతున్నారంటున్నారు. వాస్తవానికి సునీల్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ కాకినాడ ఎల్బీ నగర్లో పెద్ద బిల్డింగ్ అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు. అటువంటి భవనం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఎన్నికల ముందు రావడం ... ఓటమి తరువాత కనిపించకుండా పోవడం షరామామూలేనని అంటున్నారు. ఇలా ముగ్గురు టీడీపీ పార్లమెంటు అభ్యర్థులు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. ఇటీవల చంద్రబాబు కాకినాడలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశానికి వచ్చినప్పుడు మురళీమోహన్, రూప, సునీల్ మొహం చాటేశారు. ఎటొచ్చీ హరీష్‌మాధుర్ ఆ ఒక్క రోజు మాత్రమే వచ్చి ఆ తరువాత జిల్లాలో కనిపించలేదు. ఇలా ఓటమి తరువాత పార్లమెంటు నియోజకవర్గాన్ని విడిచిపెట్టిపోయే నేతల తీరును క్యాడర్ ఏవగించుకుంటోంది. -
చంద్రబాబుకు సునీల్, రూప ఝలక్
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నాయకులు ఝలక్ ఇచ్చారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. కాకికాడ, రాజమండ్రి లోక్‌సభ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప ఈరోజు సమావేశానికి హాజరుకాలేదు. రామచంద్రపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసిన తోట త్రిమూర్తులు కూడా ముఖం చాటేశారు. వీరు ముగ్గురు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తోట త్రిమూర్తులు టీడీపీని వీడతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు సమావేశానికి రాకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలోని కాపు నాయకులు గత జూన్‌లో రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసిన విషయం తెలిసిందే (చదవండి: టీడీపీ కాపు మాజీ ఎమ్మెల్యేల రహస్య భేటీ) చంద్రబాబు పర్యటనకు కాకినాడ నేతలు దూరం టీడీపీ జిల్లా స్దాయి విస్తృత సమావేశం, నియోజకవర్గాల సమీక్షలకు కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు, జిల్లా మహిళ అధ్యక్షురాలు అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్, తొమ్మిది మంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే సీటును వనమాడి కొండబాబుకు కేటాయించవద్దని వీరంతా చంద్రబాబును కోరారు. తమ మాట వినిపించుకోకుండా కొండబాబుకు టిక్కెట్ ఇవ్వడంతో వీరందరూ అసంతృప్తిగా ఉన్నారు. తమ వినతిని చంద్రబాబు పట్టించుకోక పోవడంతో ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. (చదవండి: చంద్రబాబుతో భేటీకి కాపు నేతల డుమ్మా)