సినిమా సక్సెస్‌ అని రాజమౌళి అన్నారు | BHAAG SAALE Movie Press meet | Sakshi
Sakshi News home page

సినిమా సక్సెస్‌ అని రాజమౌళి అన్నారు

Published Sun, Jul 2 2023 6:32 AM | Last Updated on Sun, Jul 2 2023 6:32 AM

BHAAG SAALE Movie Press meet - Sakshi

శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘భాగ్‌ సాలే’. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్‌ దాస్యన్, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి మాట్లాడుతూ – ‘‘భాగ్‌ సాలే’ కల్పిత కథ. నిజాంకు ఉంగరాలపై ఆసక్తి ఉండేదంటారు.

ఈ సినిమా కథ కూడా ఓ ఉంగరం చుట్టూ తిరుగుతుంది. అందుకే హైదరాబాద్‌ నేపథ్యం ఎంచుకున్నాం. ఇందులో శ్రీ సింహా ΄ాత్ర కాస్త స్వార్థంతో కూడి ఉంటుంది. సినిమా అంతా పరిగెత్తడమే. అందుకే ‘దౌడ్‌’, ‘పరుగు’ వంటి టైటిల్స్‌ అనుకున్నాం. కానీ సౌండింగ్‌ బాగుందని ‘భాగ్‌ సాలే’ ఫిక్స్‌ చేశాం. ట్రైలర్‌ చూసి, శ్రీ సింహాతో రాజమౌళిగారు ఈ సినిమా సక్సెస్‌ అవుతుందని చె΄్పారట. దీన్ని నేను పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. ఇక దర్శకుడు హరీష్‌ శంకర్‌గారి అసోసియేషన్‌తో ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేయాలనే ఆలోచనలో ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement