
మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రెండో చిత్రం‘తెల్లారితే గురువారం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు కానీ నటన పరంగా శ్రీసింహకి మంచి మార్కులు పడ్డాయి. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. డి సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఉత్కంఠ భరితంగా సాగే ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
ఓ ఖరీదైన కారును దొంగిలించాలనుకుంటాడు హీరో. తనకు తెలిసిన టెక్నాలజీతో రోడ్డుపై ఆగి ఉన్న కారులు తలుపులు తెరుస్తాడు. కారులోకి వెళ్లగానే డోర్స్ లాక్ అవుతాయి. ఎంత ప్రయత్నించినా రాదు. స్నేహితులను పిలిస్తే వాళ్లు కూడా ఏం చేయలేకపోతారు. చివరకు ఆ దొంగ దొరికిపోయాడా? లేదా బయటపడ్డాడా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘దొంలున్నారు జాగ్రత్త’ సినిమా చూడాల్సిందే. కీరవాణి మరో కుమారుడు కాళభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment