ఓ యువకుడి పోరాటం | Bhaag Saale released on 7 july 2023 | Sakshi
Sakshi News home page

ఓ యువకుడి పోరాటం

Published Sun, Jun 18 2023 4:34 AM | Last Updated on Sun, Jun 18 2023 4:34 AM

Bhaag Saale released on 7 july 2023 - Sakshi

అనుకున్నది సాధించడానికి ఓ యువకుడు ఎలాంటి సాహసాలు చేశాడు? అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘భాగ్‌ సాలే’. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా అర్జున్‌ దాస్యన్, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల నిర్మించారు.

ఈ సినిమాను జూలై 7న విడుదల చేయనున్నట్లు శనివారం యూనిట్‌ వెల్లడించింది. ‘‘లక్ష్యాన్ని సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: రమేష్‌ కుషేందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement