
‘‘కష్ట్టపడితే సక్సెస్ సాధిస్తాం. ఇందుకు ఉదాహరణ మేమే. మొన్న నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఈ రోజు గీత్ ఆనంద్ వచ్చాడు.. రేపు ఎవరో ఒకరు వస్తారు. ‘గేమ్ ఆన్’ని ప్రేక్షకులు హిట్ చేయాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. గీత్ ఆనంద్ హీరోగా, నేహా సోలంకి, వాసంతి హీరోయిన్లుగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’.
వెంకటేశ్వరరావు కస్తూరి, సాక్షి రవి సమర్పణలో రవి కస్తూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు దయానంద్. ‘‘2023లో సౌత్ నుంచి వచ్చిన మంచి సినిమాల్లో ‘గేమ్ ఆన్’ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు గీత్ ఆనంద్. ‘‘మా సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది’’ అన్నారు రవి కస్తూరి.
Comments
Please login to add a commentAdd a comment