
కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమా నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ అధినేత డా. రవికిరణ్ ప్రస్తుతం సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కాశిష్ వోరా కథానాయిక.
ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. డా. రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ని మించిన విజయం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారు విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సప్తగిరి.
Comments
Please login to add a commentAdd a comment