Sapthagiri express
-
ఈ సినిమాకి ముగ్గురు హీరోలు
‘‘కమెడియన్ అయిన నేను ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో చేసిన సెంటిమెంట్, ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి హిట్ చేశారు. అందుకే మళ్లీ మరో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుని ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ చేశా ’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరోగా కశిష్ వోహ్రా కథానాయికగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సప్తగిరి చెప్పిన విశేషాలు. ► భారతదేశంలో ప్రతి పౌరుడుకీ న్యాయం దక్కాలని మన రాజ్యాంగం చెబుతుంది. అలాంటి న్యాయం ప్రతి ఒక్కరికీ దక్కడం కోసం పోరాడే ఓ చిన్న లాయర్ కథే ‘సప్తగిరి ఎల్.ఎల్.బి.’. ► ‘జాలీ ఎల్.ఎల్.బి’ రీమేక్ ఆలోచన నాది, రవికిరణ్గారిదే. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని కానిస్టేబుల్స్‌కు అంకితం ఇచ్చాం. ‘సప్తగిరి ఎల్.ఎల్.బి.’ని నిజాయితీ గల లాయర్స్‌కు అంకితం ఇస్తున్నాం. ► ఈ సినిమా ఎమోషన్స్‌తో నడిచినా, నా కామెడీ అలరిస్తుంది. చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలుంటాయి. కమెడియన్‌గా 75 సినిమాలు చేసినా అన్నిటిలో కనపడేది ఒకేలానే కదా? అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఏడేళ్లు కష్టపడ్డాను. అనుకోకుండా కమెడియన్‌గా మారా. అలాగే హీరోగా మారా. ఇప్పుడు ఆ ఆలోచనలను ప్రెజెంట్ చేస్తూ నిజాయితీతో సినిమాలు చేయాలనేదే నా ప్రయత్నం. ► చరణ్ లక్కాకులగారు సీనియర్ మోస్ట్ కో–డైరెక్టర్. నేను అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి కావాలనే ఆయన్ని కలిశా. రవికుమార్‌గారు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ► జాలీ ఎల్.ఎల్.బి’ చిత్రంలో బొమన్ ఇరానీగారు చేసిన పాత్రని సాయికుమార్‌గారు చేశారు. సౌరవ్ శుక్లాగారు చేసిన క్యారెక్టర్‌ను శివప్రసాద్‌గారు చేశారు. ఈ సినిమాలో నేను, శివప్రసాద్‌గారు, సాయికుమార్‌గారు ముగ్గురు హీరోల్లా చేశాం. -
చెర్రీ చేతుల మీదుగా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ ట్రైలర్
కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమా నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ అధినేత డా. రవికిరణ్ ప్రస్తుతం సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్ఎల్బి’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కాశిష్ వోరా కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. డా. రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ని మించిన విజయం ‘సప్తగిరి ఎల్ఎల్బి’ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘సప్తగిరి ఎల్ఎల్బి’ ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారు విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సప్తగిరి. -
పన్నెండేళ్ల కష్టమిది
‘‘ ప్రేక్షకులు గర్వపడేలా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఉంటుందని పాటల విడుదల రోజున పవన్‌కల్యాణ్‌గారి ముందు మాట ఇచ్చా. ఈరోజు ఆ నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉంది’’ అని సప్తగిరి అన్నారు. సప్తగిరి, రోషిణి ప్రకాశ్ జంటగా అరుణ్ పవార్ దర్శకత్వంలో డాక్టర్ రవి కిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఈనెల 23న విడుదలైంది. చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించింది. సప్తగిరి మాట్లాడుతూ–‘‘నోట్ల రద్దు టైమ్‌లోనూ ఎనిమిది నెలలపాటు రవికిరణ్‌గారు వందలమందికి పని కల్పించారు. lపన్నెండేళ్ల కష్టంతో నేను ఈ స్థాయికి చేరుకున్నా’’ అన్నారు. ‘‘సినిమా విజయాన్ని ప్రేక్షకులతో కలిసి పంచుకునేందుకు రేపటి నుంచి యాత్ర నిర్వహించనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. అరుణ్ పవార్, కెమెరామ్యాన్ సి.రాంప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు పాల్గొన్నారు. -
హీరోగా మారిన స్టార్ కమెడియన్
⇒ 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మోషన్ పోస్టర్ విడుదల కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ హోమియోపతి ద్వారా వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ కె.రవికిరణ్.. సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రోషిణీ ప్రకాశ్ ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇటీవల పోలాండ్ లో పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేర్లపాక గాందీ విడుదల చేశారు. 'కమెడియన్ గా బిజీ అవడంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో మాస్టర్స్ హోమియోపతి నిర్వహిస్తున్న రవికిరణ్‌గారి వైద్యంతో ఐదు రోజుల్లోనే రికవరీ అయ్యాను. అలా ఆ పరిచయంతో నా సినిమాకు అండగా నిలబడతానని మాటిచ్చి ఈసినిమాతో నిర్మాతగా మారారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో ఈ సినిమాకు నేనే స్క్రిప్ట్ రాసుకున్నాను. ఈ సినిమాను, నన్ను ఎవరు హ్యాండిల్ చేస్తారోనని ఆలోచించి అందుకు తగ్గ వ్యక్తిగా అరుణ్ పవార్ ను ఎంచుకున్నాను. అరుణ్ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు' అని సప్తగిరి చెప్పాడు. గాంధీ మాట్లాడుతూ.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' నుంచి సప్తగిరితో నాకు పరిచయం ఉంది. ఈ సినిమాతో సప్తగిరి హీరో కావడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత డా.కె.రవికిరణ్ మాట్లాడుతూ.. స్వతహాగా డాక్టరును అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఆసక్తితో.. సప్తిగిరితో పరచయం వల్ల నిర్మాతగా మారాను. పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పారు. దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన సప్తగిరిగారు.. నన్ను పిలిచి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. సినిమా ఇంత బాగా రావడానికి సప్తగిరితో పాటు సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ గారే కారణం. క్వాలిటీ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు. అలీ, పోసాని కృష్ణమురళి, శివప్రసాద్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్ కీలకపాత్రలు పోషించారు.