పన్నెండేళ్ల కష్టమిది | Sapthagiri Express Movie Success Meet | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్ల కష్టమిది

Dec 28 2016 12:07 AM | Updated on Sep 4 2017 11:44 PM

పన్నెండేళ్ల కష్టమిది

పన్నెండేళ్ల కష్టమిది

ప్రేక్షకులు గర్వపడేలా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఉంటుందని పాటల విడుదల రోజున పవన్‌కల్యాణ్‌గారి ముందు మాట ఇచ్చా.

‘‘ ప్రేక్షకులు గర్వపడేలా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఉంటుందని పాటల విడుదల రోజున పవన్‌కల్యాణ్‌గారి ముందు మాట ఇచ్చా. ఈరోజు ఆ నమ్మకం నిజమైనందుకు  ఆనందంగా ఉంది’’ అని సప్తగిరి అన్నారు. సప్తగిరి, రోషిణి ప్రకాశ్‌ జంటగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డాక్టర్‌ రవి కిరణ్‌ నిర్మించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఈనెల 23న విడుదలైంది. చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. సప్తగిరి మాట్లాడుతూ–‘‘నోట్ల రద్దు టైమ్‌లోనూ ఎనిమిది నెలలపాటు రవికిరణ్‌గారు వందలమందికి పని కల్పించారు. lపన్నెండేళ్ల కష్టంతో నేను ఈ స్థాయికి చేరుకున్నా’’ అన్నారు. ‘‘సినిమా విజయాన్ని ప్రేక్షకులతో కలిసి పంచుకునేందుకు రేపటి నుంచి యాత్ర నిర్వహించనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. అరుణ్‌ పవార్, కెమెరామ్యాన్‌ సి.రాంప్రసాద్, ఎడిటర్‌ గౌతంరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement