
తిరుమలలో సప్తగిరి
ఎక్స్ప్రెస్రాజా, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల్లో నా హాస్యానికి మంచి స్పందన వచ్చిందని టాలీవుడ్ హాస్యనటుడు సప్తగిరి తెలిపారు.
తిరుమల : ఎక్స్ప్రెస్రాజా, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల్లో నా హాస్యానికి మంచి స్పందన వచ్చిందని టాలీవుడ్ హాస్యనటుడు సప్తగిరి తెలిపారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ రెండు చిత్రాలతో ఈ ఏడాది తన కెరీర్కు హిట్ టాపిక్ రావడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోను సునీల్ హీరోగా కృష్ణాష్టమి చిత్రంలో తన హాస్యం ప్రేక్షకులను మరింతగా నవ్విస్తుందన్నారు. భవిష్యత్లోనూ ప్రేక్షకులను మరింత నవ్వించేందుకు మరిన్నీ హస్య చిత్రాల్లో నటిస్తానని సప్తగిరి చెప్పారు.