దొంగలకు దొంగ. | saptagiri next movie titled gajadonga | Sakshi
Sakshi News home page

దొంగలకు దొంగ.

Published Mon, Jul 9 2018 12:30 AM | Last Updated on Mon, Jul 9 2018 12:30 AM

saptagiri next movie titled gajadonga - Sakshi

సప్తగిరి

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి లేటెస్ట్‌గా ‘గజదొంగ’గా మారనున్నారు. సప్తగిరి హీరోగా డి.రామకృష్ణ దర్శకత్వంలో నంద నందనా బ్యానర్‌పై శర్మ చుక్కా, యెడల నరేంద్ర, జి.వి.యన్‌. రెడ్డి నిర్మించనున్న చిత్రం ‘గజదొంగ’. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘సప్తగిరికి కరెక్ట్‌గా సూట్‌ అయ్యే సబ్జెక్ట్‌ ఇది. ఆడియన్స్‌ను అలరించే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎన్టీఆర్‌ ‘గజదొంగ’ సినిమాకు, మా చిత్రానికి ఏ సంబంధం ఉండదు. సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. ఆగస్ట్‌ ఫస్ట్‌ వీక్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ వనమాలి, లైన్‌ ప్రొడ్యూసర్‌: ఆర్‌వీవీవీ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement