హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల వల్లే రాష్ట్ర విభజన జరిగిందన ఆయన అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పటికి క్షమించరని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు జాతి చరిత్రలో బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నా తమకు లేనట్లేనని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.
కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై సీమాంధ్ర శివమెత్తుతోంది. సమైక్యం కోసం నాలుగు నెలలుగా అనునిత్యం పోరాడుతున్న 13 జిల్లాలు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. బంద్‌లు, హర్తాళ్లు, ధర్నాలు, రాస్తారోకోలతో జిల్లాలు దద్దరిల్లిపోతున్నాయి. ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది. కేంద్రం తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుతో సీమాంధ్ర స్తంభించింది.
వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యవాదులు ఎక్కడికక్కడ నిరసనలతో మళ్లీ మళ్లీ సమైక్య ఆకాంక్ష చాటి చెబుతున్నారు. ఓట్లు, సీట్లే పరమావధిగా కోట్ల ప్రజల జీవితాలను ఒక్క వేటుతో బలి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఉద్యమకారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మొత్తానికి కేంద్రం పెట్టిన విభజన చిచ్చుతో సీమాంధ్ర మళ్లీ రగులుకుంది. లక్ష్యం చేరేవరకు ఈ సెగలు ఆరబోవని ఉద్యమకారులు తేల్చిచెబుతున్నారు.
'రాష్ట్రంలో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తాం'
Published Fri, Dec 6 2013 1:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement