
సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది?: దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై గురువారం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏలా ఉందంటూ సీమాంధ్ర మంత్రులను, నేతలను ఆరా తీసినట్టు తెలిసింది.
దానికి సీమాంధ్ర మంత్రులు, నేతలందరూ రాష్ట్రవిభజనపై కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో కాంగ్రెస్ కుదేలయిందని దిగ్విజయ్ ముందు వారు వాపోయినట్టు తెలుస్తోంది.
దాంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునే మార్గాలను సూచించాలని తనను కలిసిన సీమాంధ్ర మంత్రులను దిగ్విజయ్ సింగ్ కోరినట్టు సమాచారం.