గుంటూరు : తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ ప్రదేశ్గా మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విభజించవద్దని రాయపాటి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, సమైక్యంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి లాభమని ఆయన అన్నారు.