
సాక్షి, గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు తన అబ్బాయికి ఇవ్వమని అడిగితే చూద్దాం.. ఆలోచిద్దామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కోడెలకు టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు చెప్తున్న ఆయనకు ఎందుకు కాన్ఫామ్ చేశారని ప్రశ్నించారు. తనకు టికెట్ కేటాయించకుండా దూరం పెట్టడానికి తాను చేసిన అన్యాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వేరే వారి నుంచి ఒత్తిడి ఉండటం వల్లే మూడు సార్లు మీటింగైనా సీటు సంగతి తేల్చలేదని ఆరోపించారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమేనని, కుటుంబ సభ్యులు, అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ( ఇది చదవండి : ముడుపుల గుట్టు విప్పేస్తా)