
'విభజన ఆగకుంటే కొత్తపార్టీ వస్తుంది'
రాష్ట్ర విభజన ఆగకుంటే సీమాంధ్రలో కొత్త పార్టీ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.
గుంటూరు:రాష్ట్ర విభజన ఆగకుంటే సీమాంధ్రలో కొత్త పార్టీ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు. వచ్చేనెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించే సభకు రాయపాటి ముందుగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఎక్కువరోజులు సీమాంధ్ర ఉద్యమాలు జరగవనే ఉద్దేశంతోనే విభజన ప్రక్రియ సాగుతోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాజీ నామాలు చేయలేకపోవడం వల్లే ధర్నాలు చేయడం లేదని రాయపాటి పేర్కొన్నారు.
గత కొన్నిరోజులుగా సీమాంధ్రలో సమైక్య నిరసనలు ఎగసి పడుతుండటంతో రాజకీయ నేతలు కూడా ఉద్యమానికి సహకరించకతప్పడం లేదు. ఏపీఎన్జీవోలతో కలసి ఉద్యమంలో పాల్గొంటామని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.