సాక్షి, గుంటూరు : టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఫైర్ అయ్యారు. రాయపాటికి మతిభ్రమించిందని, అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ రాయపాటి ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్కపనీ చేయలేదు. సొంత సామాజికవర్గం ఎమ్మెల్యేలే ఆయన్ను నియోజకవర్గంలో అడుగు పెట్టనీయలేదు. మరి అప్పుడు కులం గురించి ఎందుకు మాట్లాడలేదు?. రాయపాటి దగ్గరి బంధువే మా నియోజకవర్గంలో ఉద్యోగం చేస్తున్నాడు. మరి కమ్మవారికి ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఎలా మాట్లాడతారు? వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే రాయపాటికి గౌరవం ఉంటుంద’ని అన్నారు.
చదవండి : ‘సీఎంపై రాయపాటి వ్యాఖ్యలు అర్థరహితం’
రాయపాటిపై నంబూరు శంకర్రావు ఫైర్!
Published Sun, Apr 19 2020 7:12 PM | Last Updated on Sun, Apr 19 2020 7:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment