
'సమైక్య ఉద్యమం వెనక నాయకుల ప్రమేయం లేదు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టం పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు నలభై రోజులుగా సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం వెనక ఎటువంటి నాయకుల ప్రమేయం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే శనివారం న్యూఢిల్లీలో జరగనున్న ఎంపీల సమావేశానికి హాజరుకావడం లేదని రాయపాటి సాంబశివరావు వెల్లడించారు.