
రాయపాటి సాంబశివరావు(ఫైల్)
పెద్దకాకానిలో ఓటర్లకు డబ్బు పంచుతూ పెద్దకాకాని టీడీపీ దర్శి వెంకటేశ్వర్లు పోలీసులకు పట్టుబడ్డారు.
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీడీపీ ఆగడాలు హద్దుమీరాయి. గుంటూరు జిల్లా పెద్దకాకానిలో ఓటర్లకు డబ్బు పంచుతూ పెద్దకాకాని టీడీపీ దర్శి వెంకటేశ్వర్లు పోలీసులకు పట్టుబడ్డారు. తక్కెళ్లపాడులో పోలీసులపై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. పెద్దారవీడు మండలం చాట్లమడ అగ్రహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో వైఎస్సార్ సీపీ- టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసుల లాఠీచార్జ్ చేశారు. మరోవైపు రాయపాటి సాంబశిరావుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలు పెట్టింది.