'తెలంగాణ'పై సీడబ్ల్యూసీ వెనక్కి తగ్గవచ్చు: రాయపాటి
'తెలంగాణ'పై సీడబ్ల్యూసీ వెనక్కి తగ్గవచ్చు: రాయపాటి
Published Tue, Oct 15 2013 8:29 PM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు, ఎంపీల రాజీనామాల ప్రభావం ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అని సీనియర్ కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మందగించింది అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
గుంటూరు జిల్లాలోని లక్ష్మిపురం క్యాంప్ కార్యాలయంలో రాయపాటి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ విభజనకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదనే గుడ్డి నమ్మకంతో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కాంగ్రెస్ ఎంపీలు బ్లాంక్ చెక్ ను ఇచ్చారు అని అన్నారు. తాము కూడా తప్పు చేశామని ఆయన అన్నారు.
విభజన వల్ల ఫార్మాస్యూటికల్ రంగంలో, ఐటీ హబ్ లాంటి హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన యువత ఉపాధి అవకాశాలు కోల్పోతుంది అని తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటు, ఏ పార్టీపై పోటీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు రాయపాటి సమాధానం దాటి వేశారు.
Advertisement