సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు రంగం సిద్ధం చేస్తున్నాయి. సుమారు రూ. 452.41 కోట్లు ట్రాన్స్‌ట్రాయ్ బకాయి పడటంతో ఆస్తులను వేలం వేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ పత్రికల్లో వేలం నోటీసులను జారీ చేసింది. రుణం కోసం తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది. (‘ట్రాన్స్‌ట్రాయ్’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ)
ఇక 2017 జనవరి 9 నాటికి సెంట్రల్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్లు కాగా, వీటికి హామీదారులుగా ట్రాన్స్‌ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 51లో 640 చదరపు గజాల స్ధలాన్ని వేలం వేస్తున్నారు. మరోవైపు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్‌కు సంబంధించి సుమారు రూ. 300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ బకాయిలు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకులకు ట్రాన్స్‌ట్రాయ్ రూ. 3,694 కోట్ల మేర బకాయి పడింది. (వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం)
Comments
Please login to add a commentAdd a comment