
నిమా హీరోలు ఒక్క హిట్టు కొడితేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఒకటీరెండు కాదు.. ఏకంగా మూడు చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నాడు. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాను సృష్టించాడు.
రెస్ట్ కోసం..
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షారుక్ మాట్లాడుతూ.. నాకు కాస్త విశ్రాంతి అవసరమనిపించింది. గతేడాది మూడు సినిమాల కోసం శారీరకంగా చాలా కష్టపడ్డాను. అందుకే కొంత బ్రేక్ తీసుకున్నాను. అలాగే నా ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు అన్ని మ్యాచులకు వస్తానని మాటిచ్చాను.
ఆ మజానే వేరు
ఆ మాట మీద నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. అయినా స్టేడియంలో ఉంటే ఆ మజానే వేరు! సినిమాలంటారా..? నా కొత్త ప్రాజెక్టులు జూలై, ఆగస్టులో ప్రారంభం కానున్నాయి. అప్పటివరకు క్రికెట్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తాను అని షారుక్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ఆరుగురు హీరయిన్లతో ‘హీరామండి’..ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment