పెళ్లి కోసం షారుఖ్‌ ఖాన్‌ పేరునే మార్చుకున్నాడా? | Do You Know Shah Rukh Khan Changed His Name As A Abhinav For Gauri | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం షారుఖ్‌ పేరును మార్చాలనుకున్న గౌరీ.. బాద్‌షా లవ్‌స్టోరీలో ట్విస్టులెన్నో..

Published Tue, Oct 8 2024 4:08 PM | Last Updated on Tue, Oct 8 2024 4:48 PM

Do You Know Shah Rukh Khan Changed His Name As A Abhinav For Gauri

బాలీవుడ్ లో అందమైన జంటలలో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ ఒకరు. విరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1991లో షారుఖ్‌-గౌరిల పెళ్లి జరిగింది. ఓ పార్టీలో గౌరిని చూసిన షారుఖ్‌.. తొలి చూపుతోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడట. తన భార్యగా గౌరీనే ఉండాలని ఫిక్స్‌ అయిపోయాడట. అప్పటికి షారుఖ్‌ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. చాలా కాలం తర్వాత షారుఖ్‌ ప్రేమను గౌరి అంగీకరించింది. అయితే వీరి వివాహానికి గౌరి ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో షారుఖ్‌ పేరుని అభినవ్‌గా మార్చి ఫ్యామిలీ వాళ్లకి పరిచయం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని గౌరీ గతంలో ఓ ఇంటర్యూలో చెప్పింది.

‘ఇద్దరి మతం వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో రిజిస్ట్రైషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం. ఆ తర్వాత షారుఖ్‌కి అభినవ్‌ అని పేరు మార్చి ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాను. అలా పరిచయం చేస్తే షారుఖ్‌ హిందువు అని భావించి.. పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నాను. అది చాలా సిల్లీ, చైల్డీష్‌ ఆలోచన’ అని గౌరి ఓ ఇంటర్యూలో చెప్పింది.

చాలా గొడవల షారుఖ్‌-గౌరిల పెళ్లి జరిగింది. 1991 అక్టోబర్‌ 25న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత గౌరి మతం మార్చుకుంటుందని అంతా భావించారు. కానీ ఆమె మారలేదు. షారుఖ్‌ కూడా ఈ విషయంలో గౌరిని బలవంతం పెట్టలేదు.  ‘నాలాగే షారుఖ్‌ కూడా అన్ని మతాలకు గౌరవం ఇస్తాడు. తన మతంలోని మారమని ఎప్పుడూ నన్ను అడగలేదు’అని ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్‌ చెప్పొచ్చింది. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. ఆర్యన్‌ ఖాన్ , సుహానా, అబ్రం ఖాన్‌. పెళ్లి తర్వాత గౌరీ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియాలోని టాప్‌ ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఖాన్‌ ఒకరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement