
Shah Rukh Khan And Gauri Khan Love Story: బాలీవుడ్ ‘బాద్‌షా’ షారుక్ ఖాన్ నేటితో 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. మంగళవారం(నవంబర్ 2) షారుక్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తనయుడు ఆర్యన్ అరెస్టుతో కొద్ది రోజులుగా షారుక్ కుటుంబం విచారంలో ఉంది. దీంతో దసరా, షారుక్-గౌరీ ఖాన్‌లు తమ వెడ్డింగ్ యానివర్సరిని కూడా జరుపుకోలేదు. ఇటీవల ఆర్యన్‌కు బెయిల్ మంజూరు కావడం, అతడు జైలు నుంచి విడుదలవడంతో వారిలో ఆనందం నెలకొంది. ఇక ఈ రోజు షారుక్ బర్త్‌డే కూడా ఉండటంతో మన్నత్‌లో సెలబ్రెషన్స్ రెట్టింపు అయ్యాయి.
చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..
ఇక దీపావళి పండుగ కూడా రావడంతో షారుక్ నివాసం మన్నత్‌ను మొత్తం దీపాలతో అలంకరించారు. బయటి నుంచి చూస్తే మన్నత్ మొత్తం దీపాల అలంకరణతో వెలిగిపోతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 25న షారుక్-గౌరీఖాన్‌ల పెళ్లి రోజు. ఈ నేపథ్యంలో వారి పెళ్లి, ప్రేమయాణం గురించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సినీ క్రిటిక్ అనుపమ చోప్రా షారుక్ బయోగ్రఫీ రాసిన సంగతి తెలిసిందే. ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’ అనే పేరుతో ఈ బుక్‌ను ఆమె విడుదల చేశారు. అయితే షారుక్-గౌరీలది ప్రేమ వివాహం అని తెలిసిందే. 25 అక్టోబర్ 1991లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే వారు కొన్నేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు.
చదవండి: దీపావళికి ముందే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది: హీరోయిన్
స్కూలింగ్ నుంచే విరిద్దరికి పరిచయం ఉంది. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ వీరి పెళ్లికి గౌరీ కుటుంబ సభ్యులు మొదట్లో వ్యతిరేకించినట్లు అనుపమ తన బుక్‌లో పేర్కొన్నారు. దీంతో వారిని పెళ్లికి ఒప్పించేందుకు షారుక్ ఎన్నో ప్రయత్నాలు చేశారట. చెప్పాలంటే వీరిద్దరూ ఓ యుద్ధమే చేశారని చెప్పుకొవచ్చు. అయినా గౌరీ తల్లిదండ్రులు మరింత మొండిగా ప్రవర్తించారట. ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’ అనే బుక్‌లో అనుపమ ఏమని రాసుకొచ్చారంటే.. షారుక్ ఓ నటుడు అయినందుకే గౌరీ తండ్రి రమేశ్ చిబ్బర్ వారి ప్రేమను నిరాకరించారని అనుపమ రాసుకొచ్చారు. గౌరీ తండ్రికి సినిమాల్లో నటించడం అసలు నచ్చదట.
చదవండి: షారుక్ ఖాన్ బర్త్‌డే.. వెలిగిపోతున్న 'మన్నత్'
అలాగే గౌరీ తల్లి సవిత కూడా వారిద్దరూ విడిపోవాలని పులువురు జ్యోతిష్యులను కూడా కలిశారట. ఇక ఆమె సోదరుడు విక్రాంత్ అయితే ఏకంగా షారుక్‌ను గన్‌తో బెదిరించాడట. అయితే అతడికి గుండా అనే పేరు కూడ ఉందట. విక్రాంత్ గుండాయిజం చేసేవాడని సమాచారం. కానీ షారుక్ అతడికి ఏమాత్రం బయపడలేదట. చివరకు షారుక్ ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గౌరీ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారట. దీంతో వారు ఒకే చెప్పడంతో చివరికి వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1991 అక్టోబర్ 25న వీరి పెళ్లి ముహుర్తం ఖారారు చేయడం, చకచక వారి వివాహం జరిగిపోయింది. ప్రస్తుతం షారుక్-గౌరీలకు ముగ్గురు సంతానం, ఇద్దరు కుమారులు ఆర్యన్ ఖాన్, అభ్‌రాం కాగా, కూతురు సుహనా ఖాన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment