బాలీవుడ్ బాద్‌షా గతేడాది జవాన్, పఠాన్, డుంకీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. జవాన్, పఠాన్ బ్లాక్‌బస్టర్ హిట్ కాదగా.. డిసెంబర్లో రిలీజైన రాజ్ కుమార్ హిరానీ చిత్రం డుంకీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం షారుక్ ఎలాంటి ప్రాజెక్ట్‌లోను నటించడం లేదు. తాజాగా మన బాలీవుడ్ హీరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డ్‌కు ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని ఫెస్టివల్ సైట్ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసినందుకు అవార్డ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన జరగనున్న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు. అంతేకాకుండా ఈ వేడుకలో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన దేవదాస్ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతంలో సాయ్ మింగ్-లియాంగ్, క్లాడియా కార్డినాలే, జానీ టో, ఫ్రాన్సిస్కో రోసీ, హ్యారీ బెలాఫోంటే, జేన్ బిర్కిన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment