
ఎలా పుట్టాం అనేది కాదు ఎలా బతుకుతున్నాం అనేదే ముఖ్యం.

ఈ విషయంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాలామందికి స్ఫూర్తి.

ఎందుకంటే ఢిల్లీలో పుట్టి పెరిగాడు. సినిమాలపై పిచ్చితో ముంబైకి వచ్చాడు.

చేతిలో డబ్బుల్లేక సరైన తిండి తినక, బీచ్‌లోనే చాలా సార్లు పడుకున్నాడు.

సీరియల్ నటుడిగా మొదలై, సినిమాల్లో సహాయ నటుడిగా, హీరోగా, పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగాడు.

షారుఖ్ ఖాన్ అంటే పేరు కాదు ఇప్పుడు అదో బ్రాండ్ అనేంతలా తన క్రేజ్ పెంచుకున్నాడు.

1995లో వచ్చిన 'దిల్ వాలే దుల్హనియా లేజాయింగే' సినిమాతో షారుఖ్‌కి బ్రేక్ దక్కింది.

ఇక అక్కడి నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సక్సెస్ అయ్యాడు.

పేరుకే హిందీ నటుడు అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఊహించనంత గుర్తింపు సాధించాడు.

చాలా ఏళ్ల పాటు బాలీవుడ్‌ని ఏలిన షారుఖ్.. 2018లో 'జీరో' మూవీ ఫ్లాప్ దెబ్బకు పూర్తిగా సైలైంట్ అయిపోయాడు.

షారుఖ్ ఖాన్ పనైపోయిందని చాలామంది అన్నారు. కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం బాగా ఇబ్బంది పెట్టింది.

దాదాపు ఐదేళ్ల తర్వాత 'పఠాన్', 'జవాన్', 'డంకీ' సినిమాలతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. రూ.1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకున్నాడు.

59 ఏళ్లొచ్చినా గానీ ఇప్పటికీ చాలామంది కుర్రాళ్లకు అసూయ పడేంత అందంగా ఉంటాడు. అదీ షారుఖ్ అంటే.

షారుఖ్ ఆస్తి విలువ దాదాపు రూ.7,300 కోట్లు అని టాక్. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు, ఒక్కో యాడ్‌కు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడట.

ముంబై నడిబొడ్డున షారుఖ్‌కి 'మన్నత్' పేరుతో ఓ ఇల్లు ఉంది. దీని విలువ వందల కోట్ల రూపాయలు.

ఇక హీరోగానే కాదు నిర్మాతగా, ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు యాజమానిగానూ షారుఖ్ బోలెడంత ఫేమస్.
