
ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్ ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమైంది. శనివారం సన్‌రైజర్స్ - కోల్‌కతా నైట్ రైజర్స్ మధ్య పోటీ జరిగింది. తన జట్టుకు మద్దతు తెలిపేందుకు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.. కోల్‌కతాలోని స్టేడియంలో అడుగుపెట్టాడు. ఇతడిని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
ఇదిలా ఉంటే మ్యాచ్ వీక్షించేటప్పుడు షారుక్ పొగ తాగాడంటూ చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ, స్టేడియంలో ఇలాంటి పాడుపనులేంటని విమర్శిస్తున్నారు. కనీసం అక్కడ ఉన్నంతసేపైనా దమ్ము కొట్టకుండా ఉండొచ్చుగా.. అంత బానిసైపోయాడా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. షారుక్ సినిమాల సంగతికొస్తే.. గతేడాది పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాడు. టైగర్ 3 మూవీలో అతిథి పాత్రలో మెరిశాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠగా జరిగిన పోరులో సన్ రైజర్స్‌ను ఓడించి కేకేఆర్ విజయం సాధించింది.
Cameraman ki timing 😂😭
— Our darling (@Our_darling___) March 24, 2024
What a timing Bakra 😂😂#ShahRukhKhan #IPL2024 #KKRvSRH https://t.co/JUYnHKIdwd
Comments
Please login to add a commentAdd a comment