చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకోవడాన్ని మించిన బాధ మరొకటి లేదంటున్నాడు హీరో షారూఖ్ ఖాన్. ద గ్లోబల్ ఫ్రెయిట్ సమ్మిట్ వేదికలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. నా చిన్నతనంలోనే అమ్మానాన్న మరణించారు. నాన్న 14 ఏళ్ల వయసులో, అమ్మ 24 ఏళ్ల వయసులో చనిపోయారు. పదేళ్ల వ్యవధిలోనే ఇద్దర్నీ కోల్పోయాను. ఎక్కడికెళ్లాలో తెలియలేదు.
పేరెంట్స్ కోసం కష్టపడ్డా..
నాతో పాటు అక్క కూడా ఉంది. మా ఇద్దరినీ ఈ ప్రపంచంలో వదిలేసి పోయారు. ఆకాశంలోని నక్షత్రాల్లో కలిసిపోయారు. ఎప్పటికైనా ఆ నక్షత్రాల్ని అందుకోవాలనుకునేవాడిని. బహుశా అక్కడ కూడా వాళ్లు మా గురించి కంగారుపడేవారేమో! అందుకనే జీవితంలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడ్డాను. ఎక్కడున్నా నా పేరెంట్స్ బాధపడకూడదని ప్రయత్నించాను. చివరకు అనుకున్నది సాధించాను.
గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని
వాళ్లకన్నా ముందు నేను చనిపోయుంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను తిరిగి రాలేనన్న బాధలో నుంచి వారు బయటపడేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ చివరగా డంకీ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి షారూఖ్ కూతురు సుహానా ఖాన్‌తో పాటు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment