విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్‌ అయిందెవరంటే? | Bigg Boss Telugu 8: Buzz, Last Mega Chief is Rohini | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ షోలో చివరి చీఫ్‌ పోస్ట్‌.. ఎవరిని వరించిందంటే?

Published Wed, Nov 20 2024 4:26 PM | Last Updated on Wed, Nov 20 2024 7:03 PM

Bigg Boss Telugu 8: Buzz, Last Mega Chief is Rohini

బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌లో కెప్టెన్‌ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్‌లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్‌లో కెప్టెన్‌ పోస్టు ఉండదన్నాడు బిగ్‌బాస్‌.. కానీ అంతలో చీఫ్‌ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్‌ అయినవారు ఆ వారం నామినేషన్స్‌లో ఉండరు. 

చివరి ఇమ్యూనిటీ 
ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో నిఖిల్‌, యష్మి, ప్రేరణ, అవినాష్‌, విష్ణుప్రియ, గౌతమ్‌, నబీల్‌ అంతా కూడా ఒకసారి చీఫ్‌ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్‌బాస్‌ తాజాగా హౌస్‌లో చీఫ్‌ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్‌లోనే చివరి చీఫ్‌ పోస్ట్‌ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.

చీఫ్‌గా రోహిణి!
బిగ్‌బాస్‌ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్‌ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్‌లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్‌మేట్స్‌ మద్దతుతో రోహిణి చీఫ్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్‌లో లేదు, వచ్చేవారం చీఫ్‌ పోస్టుతో మరోసారి సేవ్‌ అయిపోయింది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement