'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే దీని గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్. మరోవైపు ఈ మూవీ మొదలవడానికి ముందే బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఒక దానిపై నిర్మాతలే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏంటది?
(ఇదీ చదవండి: వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా)
మహేశ్‌తో మూవీ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే రాజమౌళి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కానీ హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండోనేసియా నటిని హీరోయిన్ గా తీసుకున్నారని, ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నటించబోతుందని అన్నారు. అలానే నాగార్జున కీలక పాత్ర చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.
అయితే పైన వచ్చిన రూమర్స్ వేటికి స్పందించని నిర్మాణ సంస్థ.. వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ తమతో కలిసి పనిచేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ రూమర్స్ ఎప్పుడొచ్చాయా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా విషయాల కంటే పర్టిక్యూలర్‌గా ఈ విషయం కోసం ఎందుకు నోట్ రిలీజ్ చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. చేస్తే చేశారు గానీ అలానే మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే అప్డేట్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ అయిన ఖుషీ అయ్యేవారు!
(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్)
Comments
Please login to add a commentAdd a comment