ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్‌బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్‌బాబు లుక్‌ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోలా మహేశ్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు మహేశ్-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment