
#SSMB గురించి చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ లేకున్నా.. ఏదో ఒక రూపంలో ట్రెండింగ్ లోనే ఉంటోంది. రాజమౌళి మూవీకి సంబంధించిన పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఆయన్ని కెమెరాలు క్లిక్ చేశాయి. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరి నుంచి పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.








