
సాధారణంగా రాజమౌళి(SS Rajamouli) సినిమా షూటింగ్ స్పాట్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. సెట్‌లోకి ఫోన్లు కూడా అనుమతించడు. చిన్న ఫోటో కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తాడు. రిలీజ్ వరకు జనాలకు ఏం చూపించాలనుకుంటాడో అదే చూపిస్తాడు. ఆయన తెరకెక్కించిన గత సినిమాల్లో వీడియో, ఫోటో లీకులు తక్కువే. కానీ మహేశ్ బాబు సినిమా(SSMB29 )కు మాత్రం లీకుల బెడద తప్పడం లేదు. రాజమౌళి ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నా..ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటికే మహేశ్ లుక్ సంబంధించిన ఫోటో లీకైంది. తాజాగా షూటింగ్‌కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చేసింది.
సోషల్ మీడియాలో వైరల్
ఎస్‌ఎస్‌ఎంబీ29(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. అక్కడ మహేశ్ బాబుపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలో మహేశ్ షూటింగ్ క్లిప్పు ఒకటి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారులో నుంచి రహస్యంగా ఆ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
దయచేసి షేర్ చేయకండి.. ఫ్యాన్స్ విజ్ఞప్తి
మహేశ్ బాబు(Mahesh Babu) షూటింగ్‌కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయ్యొదని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇలాంటి సినిమాలను బిగ్ స్క్రీన్‌పైనే చూడాలని, ఇలా వీడియోలు లీక్ చేస్తే ఆ మజా పోతుందని కామెంట్ చేస్తున్నారు. తెలియకుండా ఎవరైనా షేర్ చేసి ఉంటే..వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయాలని కోరుతున్నారు. అలాగే చిత్రబృందం కూడా ఆ వీడియో నెట్టింట్లో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ లీకులపై ఎలా స్పందిస్తారో చూడాలి.
రెండు భాగాలుగా..
రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌తో పాటు ఇతర కీలక పాత్రల్లో ఎవరు నటిస్తునారనే విషయాలను రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment