మహేశ్ బాబు విరాళం.. డిస్కషన్ మాత్రం వాటి గురించి | Mahesh Babu Met Revanth Reddy To Give Donation For Flood Victims, New Stylish Look Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్ రగ్గ్‌డ్ లుక్.. పూర్తిగా బయటపెట్టేశాడు

Published Mon, Sep 23 2024 1:01 PM | Last Updated on Mon, Sep 23 2024 3:34 PM

Mahesh Babu Met Revanth Reddy For Donation Look Viral

హీరో మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా ప్రిపరేషన్‌లో ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ నడుస్తోంది. మూవీలోని తన పాత్ర కోసం మహేశ్ లుక్ మొత్తం మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయంగా రూ.50 లక్షల విరాళం అందజేశాడు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించాడు. ఏఎంబీ తరఫున మరో రూ.10 లక్షలు కూడా విరాళమిచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)

మహేశ్ విరాళం ఇచ్చాడు. అయితే డబ్బులు సాయం చేశాడు అనే విషయం కంటే అతడు లుక్ హైలెట్ అవుతోంది. జూలపాల జట్టు, గుబురు గడ్డంలో మహేశ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు మహేశ్ ప్రయోగాలు చేయలేదు, మాస్‌గా కనిపించలేదు అని ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. ఇప్పుడు డిఫరెంట్‌గా కనిపిస్తున్న మహేశ్‪‌ని చూసి ఫిదా అయిపోతున్నారు.

దాదాపు నాలుగేళ్ల క్రితం మహేశ్‌తో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. ఈయన తీసిన 'ఆర్ఆర్ఆర్' వచ్చి కూడా రెండేళ్లకు పైనే అయిపోయింది. అలాంటిది ఓ అప్‌డేట్ కూడా రాలేదు. ఇప్పట్లో వస్తాదనే గ్యారంటీ కూడా లేదు. కానీ వచ్చే ఏడాది షూటింగ్ మొదలవ్వొచ్చని అంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.

(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement