హైదరాబాద్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓ దశలో టీమిండియా సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అటువంటి సమయంలో న్యూజిలాండ్ లోయార్డర్ బ్యాటర్ మైఖేల్ బ్రెస్‌వెల్ తన సంచలన ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు చెమటలు పట్టించాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 78 బంతులు ఎదుర్కొన్న బ్రెస్‌వెల్ 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు సాధించాడు. అయితే ఆఖరి ఓవర్‌లో శార్థూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రెస్‌వెల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
ఛేజింగ్‌లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో కూడా ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా లోయార్డర్‌లో(ఏడో లేదా అంతకంటే తక్కువ)బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన మూడో ఆటగాడిగా శ్రీలంక ఆల్‌రౌండర్ తిషార పెరీరాతో కలిసి బ్రెస్‌వెల్ సంయుక్తంగా నిలిచాడు.
చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్‌చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment