
కార్డిఫ్: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే అరుదైన ఘనతను నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కరుణరత్నే(52 నాటౌట్) ఓపెనర్‌గా వచ్చి అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి కడవరకూ క్రీజ్‌లో ఉండి అజేయంగా నిలిచిన రెండో ఆటగాడిగా కరుణరత్నే ఘనత సాధించాడు. శ్రీలంక వరుసగా వికెట్లు చేజార్చుకున్నప్పటికీ కరుణరత్నే బాధ్యతాయుతంగా ఆడాడు. దాంతో శ్రీలంక 136 పరుగులు చేసింది.
అంతకుముందు వెస్టిండీస్ క్రికెటర్ రిడ్లీ జాకబ్స్ ఈ ఘనత సాధించాడు. 1999 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జాకబ్స్ ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అతని సరసన కరుణరత్నే స్థానం సంపాదించాడు. కాగా, ఆనాటి మ్యాచ్‌లో జాకబ్స్ 49 పరుగులు మాత్రమే చేసి హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో నిలవగా, కరుణరత్నే హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment