
కార్డిఫ్: ఓవరాల్ వరల్డ్‌కప్ చరిత్రలో న్యూజిలాండ్ మరోసారి అరుదైన ఘనతను సాధించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో విజయ సాధించడమే కాకుండా 203 బంతులు మిగిలి ఉండగానే గెలుపును అందుకుంది. ఫలితంగా ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో విజయం సాధించే క్రమంలో అత్యధిక బంతుల్ని మిగుల్చుకుని మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. గతంలో కెన్యాపై న్యూజిలాండ్ అతిపెద్ద విజయం సాధించింది.
(ఇక్కడ చదవండి: కివీస్ కుమ్మేసింది..)
2011లో చెన్నైలో కెన్యాతో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ పడకుండా టార్గెట్‌ను ఛేదించి 252 బంతుల్ని అంటిపెట్టుకుంది. ఇదే నేటికీ వరల్డ్‌కప్‌లో అతిపెద్ద విజయం కాగా, మరొకసారి న్యూజిలాండ్ భారీ గెలుపును సాధించింది. శ్రీలంకపై న్యూజిలాండ్ సాధించిన విజయం మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 228 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment