
క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యటక శ్రీలంక పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు కీలక వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. క్రీజులో డార్లీ మిచెల్(40), బ్రేస్‌వేల్(9) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. తొలత బ్యాటింగ్ పరంగా కివీస్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీలంక.. ఇప్పుడు బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు.
లంక బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగుల మెరుగైన స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (87) పరుగలతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ కరుణరత్నె (50), ఏంజెలో మాథ్యూస్ (47), ధనుంజయ డిసిల్వ (46) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు.
ఒక వేళ ఈ మ్యాచ్ శ్రీలంక విజయం సాధిస్తే.. ఆ ప్రభావం వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ రేసుపై పడుతోంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకోగా మరో స్థానం కోసం టీమిండియా,శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి.
అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించినా, డ్రాగా ముగించినా.. శ్రీలంక గెలుపోటములతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలై.. కివీస్ సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తే, అప్పడు లంకేయులు డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెడతారు. కానీ శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడినా చాలు.. వారి డబ్ల్యూటీసీ కథ ముగిస్తోంది.!
చదవండి: IND Vs AUS: చరిత్ర సృష్టించిన ఖవాజా.. 43 ఏళ్ల రికార్డు బద్దలు! ఏకైక ఆటగాడిగా..