కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ చారిత్రత్మక విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు ఎగబాకింది.
అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా 50 శాతం పాయింట్లతో రెండో స్ధానానికి పడిపోయింది. ఇక సౌతాఫ్రికా తర్వాతి స్ధానాల్లో న్యూజిలాండ్(50.0), ఆస్ట్రేలియా(50.0),బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి.
కాగా ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మూడో టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటు చేసుకోన్నాయి. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది.
చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment