Ind Vs Aus- World Test Championship Final: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా ఖరారు చేసుకుంది. డబ్ల్యూటీసీ 2021- 23 సీజన్‌లో 11వ విజయం సాధించిన ఆస్ట్రేలియా.. జూన్ 7న ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్ లేదా శ్రీలంకతో తలపడనుంది.
మరోవైపు 10 విజయాలతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా... అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ నాలుగో టెస్టులో కూడా ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు టీమిండియా భవితవ్యం శ్రీలంకపై ఆధారపడి ఉంటుంది.
కివీస్ పర్యటనకు శ్రీలంక
ఈ నెలలో శ్రీలంక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియా, లంక మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అదే విధంగా శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి, మరో టెస్టు డ్రాగా ముగిసినా.. భారత జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది.
అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెద్ద సవాల్ కాకపోవచ్చు. కాబట్టి ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌ను కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లి సేన రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: Danielle Wyatt: అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్‌మెంట్!
Comments
Please login to add a commentAdd a comment