బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జరిగిన తొలి టెస్టులో భారత్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. టెస్టుల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా దూకుడుకు కివీస్ బ్రేక్‌లు వేసింది. మొదటి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
ఇక బెంగళూరు టెస్టు అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఓటమితో పాయింట్ల టేబుల్లో టీమిండియా స్థానం విషయంలో మాత్రం ఎలాంటి మార్పులేదు. భారత్ 98 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. కానీ ఈ ఓటమితో భారత్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.
పర్సంటేజీలో 74.24 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు ఈ చారిత్రత్మక విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి నాలుగో ప్లేస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో 44.40 విజయ శాతంతో ఇంగ్లండ్(43.06)ను కివీస్ వెనక్కి నెట్టింది. అయితే పాయింట్ల పరంగా కివీస్(48) కంటే ఇంగ్లండ్(93) మెరుగ్గానే ఉంది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.
భారత్ ఫైనల్ చేరాలంటే?
డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్‌కు టీమిండియా చేరాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్ధానాల్లో నిలిస్తే చాలు. ఈ ఓటమి భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత సైకిల్లో టీమిండియా ఇంకా ఏడు మ్యాచ్‌లు ఆడనుంది.
అందులో కనీసం మూడు విజయాలు సాధిస్తే చాలు భారత్ ఫైనల్‌కు ఆర్హత సాధిస్తుంది. అయితే ఈ సిరీస్ తర్వాత భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారులతో రోహిత్ సేన తలపడనుంది.
అయితే ఆసీస్ గడ్డపై కమ్మిన్స్ సేనను ఓడించడం అంత ఈజీ కాదు. కాబట్టి కివీస్‌తో జరగబోయే రెండు టెస్టులు కూడా భారత్‌కు కీలకమని చెప్పుకోవాలి. న్యూజిలాండ్-భారత్ మధ్య రెండో టెస్టు పుణే వేదికగా అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: జస్ప్రీత్ బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment