సెప్టెంబర్ 26 నుంచి గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మేనేజ్‌మెంట్ రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన రమేశ్ మెండిస్, లహీరు కుమార స్థానాల్లో అన్ క్యాప్డ్ ప్లేయర్ నిషాన్ పెరిస్, మిలన్ రత్నాయకే తుది జట్టులోకి వచ్చారు.
స్పిన్నర్ రమేశ్ మెండిస్ తొలి టెస్ట్‌లో ఆరు వికెట్లు తీసినప్పటికీ అతన్ని తుది జట్టు నుంచి తప్పించడం ఆసక్తికరం. రమేశ్ తొలి టెస్ట్‌లో వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని రెండో టెస్ట్ నుంచి తప్పించి ఉండవచ్చు.
పేసర్ లహీరు కుమార విషయానికొస్తే.. ఇతను తొలి టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపించ లేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అందుకే రెండో టెస్ట్‌లో ఇతని స్థానాన్ని మరో పేసర్ మిలన్ రత్నాయకేతో భర్తీ చేసింది శ్రీలంక మేనేజ్‌మెంట్.
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు శ్రీలంక తుది జట్టు..
దిముత్ కరుణరత్నే, పథుమ్ నిస్సంక, దినేశ్ చండీమల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కుసాల్ మెండిస్, నిషాన్ పెరిస్, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, అశిత ఫెర్నాండో
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కమిందు మెండిస్ సెంచరీతో ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు.
చదవండి: ENG VS AUS 3rd ODI: కుక్ రికార్డు బ్రేక్ చేసిన బ్రూక్
Comments
Please login to add a commentAdd a comment